ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజిత్ జోగి కన్నుమూత

ABN, First Publish Date - 2020-05-29T21:30:18+05:30

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన రాయ్‌పూర్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన రాయ్‌పూర్‌లోని ఆసుపత్రిలో ఇటీవలే చేరారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. 



మే 9న ఆయన గుండెపోటుతో రాయ్‌పూర్ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు శ్రీ నారాయణ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ సునీల్ ఖేమ్కా తెలిపారు.  



అజిత్ ప్రమోద్ కుమార్ జోగి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం పనిచేశారు. 2000-2003 మధ్య ఛత్తీస్‌గఢ్‌కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత ఇటీవలే జనతా కాంగ్రెస్ పార్టీ పెట్టారు. 



ఛత్తీస్‌గఢ్‌కు తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి సేవలందించారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.ఇంజనీరింగ్ సమయంలో గోల్డ్ మెడలిస్ట్. న్యాయవాది కూడా. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాయ్‌పూర్‌లో లెక్చరర్‌గా పనిచేశాక ఆయన ఐఏఎస్, ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కలెక్టర్‌గా నాలుగేళ్లు పనిచేశారు. 


2004లో అజిత్ జోగి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన రెండు కాళ్లు కోల్పోయారు. దీంతో వీల్‌చెయిర్ నుంచే రాజకీయాలు నడిపారు.  

Updated Date - 2020-05-29T21:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising