ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లండన్‌కు ఎయిరిండియా ప్రత్యేక విమానాలు.. ఎందుకో తెలుసా?

ABN, First Publish Date - 2020-04-02T21:40:25+05:30

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో చిక్కకుపోయిన విదేశీయులను బయటకు పంపేందుకు ఈ నెల 4 నుంచి ఏడో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులను బయటకు పంపేందుకు ఈ నెల 4 నుంచి ఏడో తేదీ మధ్య ఎయిరిండియా ప్రత్యేక విమానాలను నడపనుంది. ఏప్రిల్ 14 వరకు భారత్‌లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. అప్పటి వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. అయితే, అప్పటి వరకు డీజీసీఏ అనుమతితో సరుకు రవాణా విమానాలు, ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి. ఏప్రిల్ 4-7 మధ్య ఢిల్లీ-లండన్ మధ్య నాలుగు ప్రత్యేక విమానాలను నడపనున్నట్టు ఎయిరిండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే, ఏప్రిల్ 5-7 మధ్య ముంబై-లండన్ నగరాల మధ్య కూడా ప్రత్యేక విమానాలు నడపనున్నట్టు పేర్కొన్నారు. లండన్ వెళ్లే విమానాలు తిరుగు ప్రయాణంలో అక్కడి భారతీయులను వెనక్కి తీసుకొస్తాయా? అన్న ప్రశ్నకు.. అలా జరిగే అవకాశం లేదని బదులిచ్చారు. విమానాలు ఖాళీగానే వెనక్కి వస్తాయని, భారతీయులను తీసుకొచ్చే ప్రణాళికేదీ లేదని ఆయన వివరించారు. 

Updated Date - 2020-04-02T21:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising