ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

200 మంది ఉద్యోగుల కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన ఎయిరిండియా

ABN, First Publish Date - 2020-04-02T22:57:22+05:30

రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగంలో చేరిన 200 మంది ఉద్యోగుల కాంట్రాక్టును ప్రభుత్వరంగ విమానయాన సంస్థ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగంలో చేరిన 200 మంది ఉద్యోగుల కాంట్రాక్టును ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తాత్కాలికంగా రద్దు చేసింది. కాంట్రాక్ట్ రద్దు అయిన వాళ్లలో పైలట్లు కూడా ఉన్నారు. కోవిడ్-19 దేశంలో మరింత ప్రబలకుండా కేంద్రం ఈ నెల 14 వరకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. 


విమానాలన్నీ గ్రౌండ్‌కే పరిమితం కావడంతో గత కొన్ని వారాలుగా ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రిటైర్ తిరిగి ఉద్యోగంలో చేరిన దాదాపు 200 మంది ఉద్యోగుల కాంట్రాక్ట్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కేబిన్ సిబ్బంది  తప్ప మిగతా ఉద్యోగుల అలవెన్సులను వచ్చే మూడు నెలల పాటు పదిశాతం కట్ చేయనున్నట్టు ఎయిరిండియా ఇప్పటికే ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఉన్న నిధులను కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-04-02T22:57:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising