ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయంతో కువైత్‌కు ఎయిరిండియా విమానాలు రద్దు

ABN, First Publish Date - 2020-03-13T10:31:33+05:30

విమానాల రద్దు.. పర్యటనల రద్దు.. ప్రజల ప్రవేశంపై నిషేధాజ్ఞలు.. కరోనా ముప్పు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి ఇది. ఏప్రిల్‌ 30 దాకా.. కువైత్‌కు అన్ని విమానాలనూ రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇటలీకి సర్వీసుల కుదింపు

రాష్ట్రపతి భవన్‌లోకి ప్రజలకు నో ఎంట్రీ

అమెరికా రక్షణ మంత్రి పర్యటన రద్దు

న్యూఢిల్లీ, మార్చి 12: విమానాల రద్దు.. పర్యటనల రద్దు.. ప్రజల ప్రవేశంపై నిషేధాజ్ఞలు.. కరోనా ముప్పు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి ఇది. ఏప్రిల్‌ 30 దాకా.. కువైత్‌కు అన్ని విమానాలనూ రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ దేశాలకు సర్వీసులను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి రాష్ట్రపతిభవన్‌లో సందర్శనలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టు సెలవులను పొడిగించాలా లేక కార్యకలాపాలను పరిమితం చేయాలా అనే అం శంపై చర్చించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌  బోబ్డే గురువారం సాయంత్రం తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఇక..మార్చి 15-16 తేదీల్లో భారత్‌లో పర్యటించాల్సిన అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్స్‌ కరోనా భయంతోనే తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా.. దేశమంతా కరోనా భయంతో వణికిపోతుంటే నకిలీ టీకాలతో ఆ భయాన్ని సొమ్ము చేసుకుంటున్న ముగ్గురు మహిళలను మహారాష్ట్ర పోలీసులు జాల్నాలో అరెస్టు చేశారు. ఇక.. కరోనా దెబ్బకు మనదేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య రోజుకు 70 వేల నుంచి 62 వేలకు తగ్గిపోయిందని కేంద్ర మంత్రి హర్‌దీ్‌పసింగ్‌ తెలిపారు. మున్ముందు ఈ సంఖ్య 40వేలకు తగ్గొచ్చన్నారు. 

Updated Date - 2020-03-13T10:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising