ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని అభినందించిన ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2020-12-09T20:48:16+05:30

అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్ దక్కించుకున్న ప్రముఖ వైద్యుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్ దక్కించుకున్న ప్రముఖ వైద్యుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. 50 ఏళ్ల తర్వాత ఓ భారతీయ వైద్యుడికి ఈ గౌరవం దక్కడం అందరికీ గర్వకారణమన్నారు. 




అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ - 2020 సంవత్సరానికి ప్రకటించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల జాబితాలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి చోటు లభించిన విషయం తెలిసిందే.  మెడికల్ సైన్సెస్ విభాగంలో ఆయనతో పాటు మరో 39 మంది ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. గ్యాస్ట్రోఎంట్రాలజీలో చేసిన అనేక నూతన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఫెలోషిప్‌కు ఆయన ఎంపికయ్యారు. నవంబర్ 24న జాబితాను ప్రకటించగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న పురస్కారాన్ని అందించనున్నారు. ఇదిలా ఉంటే, వరల్డ్ ఎండోస్కోపీ సంస్థకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గతంలో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

Updated Date - 2020-12-09T20:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising