ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాండిచ్చేరిలో బల పరీక్ష నిర్వహించండి : అన్నాడీఎంకే డిమాండ్

ABN, First Publish Date - 2020-07-12T01:24:14+05:30

నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ - డీఎంకే సర్కార్ మెజారిటీని కోల్పోయిందని అన్నా డీఎంకే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాండిచ్చేరి : నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ - డీఎంకే సర్కార్ మెజారిటీని కోల్పోయిందని అన్నా డీఎంకే సీనియర్ నేత అన్బజగన్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనవేలును అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో సర్కార్ మెజారిటీని కోల్పోయిందని పేర్కొన్నారు. వెంటనే బల పరీక్షకు సిద్ధం కావాలంటూ ముఖ్యమంత్రిని ఆదేశించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని ఆయన కోరారు.


అయితే నారాయణ స్వామి ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకెంత మాత్రమూ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరు వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగానే ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. కోవిడ్‌ను అరికట్టడంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది కానీ.... ఓ ఎమ్మెల్యేపై మాత్రం అనర్హత వేటు వేయించిందని అన్బజగన్ ఎద్దేవా చేశారు. 


Updated Date - 2020-07-12T01:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising