‘వ్యవసాయ శాఖ మంత్రి మృతిపై సందేహాలు’
ABN, First Publish Date - 2020-11-13T14:49:58+05:30
వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను మృతిలో సందేహాలున్నాయని
చెన్నై : వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను మృతిలో సందేహాలున్నాయని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ అనుమానం వ్యక్తం చేశారు. నామక్కల్ జిల్లా డీఎంకే యువజన విభాగం నిర్వాహకుల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఉదయ నిధి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి యువజన విభాగం కృషిచేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు డీఎంకేకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అదే సమయంలో ప్రచారంలో కార్యకర్తలు నిర్లక్ష్యం వహించరాదన్నారు.
వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి, డీఎంకే హాయంలో రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను తెలియజేయాలని కోరారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎన్నికల్లో పోటీచేస్తారా..? అని ముఖ్యమంత్రి సందేహం వ్యక్తం చేస్తున్నారని, మొదటి ఆయన ఎన్నికల బరిలో నిలుస్తారా..? అన్న విషయం కాలమే చెబుతుందని అన్నారు.
Updated Date - 2020-11-13T14:49:58+05:30 IST