ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌-19 తర్వాత.. ధనిక రాష్ట్రాల్లో తగ్గనున్న తలసరి ఆదాయం

ABN, First Publish Date - 2020-06-24T07:38:09+05:30

కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక ఎకోర్యాప్‌ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధనిక రాష్ట్రాల్లో తగ్గనున్న తలసరి ఆదాయం

తెలంగాణలో 11ు, ఏపీలో 8ు క్షీణత

దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గుముఖం

ఎస్‌బీఐ నివేదిక ‘ఎకోర్యాప్‌’ వెల్లడి


ముంబై, జూన్‌ 23: కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక ఎకోర్యాప్‌ వెల్లడించింది. దీని ప్రకారం.. ముఖ్యంగా ధనిక, పేద రాష్ట్రాల మధ్య అంతరం మరింత తగ్గుతుంది. ఈ ప్రభావం ధనిక రాష్ట్రమైన తెలంగాణపైనా పడనుంది. తెలంగాణలో వ్యక్తుల తలసరి ఆదాయం సుమారు 11.1ు క్షీణించే అవకాశం ఉంది. 2020లో రూ.2.54 లక్షలుగా ఉన్న వ్యక్తుల తలసరి ఆదాయం, 2021లో రూ.2.25లక్షలకు పడిపోతుంది. ఈ క్షీణత ఏపీలో 8.1ు ఉండొచ్చు. ఆ రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1.72లక్షల నుంచి రూ.1.58లక్షలకు క్షీణించవచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వ్యక్తుల తలసరి ఆదాయం 5.4ు క్షీణిస్తుంది. ఇది సాధారణ జీడీపీలో 3.8ు తగ్గుదల కంటే ఎక్కువ. ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలపై కొవిడ్‌-19 ప్రభావం మరిం త ఎక్కువగా ఉండబోతుంది. ఆయా రాష్ట్రాల్లో తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే మరింత తగ్గుముఖం పడుతుంది.


దాదాపు 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తలసరి ఆదాయం క్షీణత రెండంకెలు నమోదయ్యే అవకాశం ఉంది. దేశ జీడీపీలో ఆయా రాష్ట్రాలు 47ుగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాలన్నీ రెడ్‌ జోన్‌లుగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. రెడ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు  నిలిచిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 10-12ు మేరకు తలసరి ఆదాయం క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తలసరి ఆదాయం తక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిసాలతో ఆయా రాష్ట్రాలు సమానమయ్యే పరిస్థితి ఉంది.


Updated Date - 2020-06-24T07:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising