ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్జి ముందే హుక్కా తాగిన సీనియర్ లాయర్.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2020-08-14T16:31:42+05:30

వర్చువల్ విచారణ అయినా, ప్రత్యక్ష విచారణ అయినా కోర్టుల్లో న్యాయమూర్తుల ముందు అందరూ అత్యంత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: వర్చువల్ విచారణ అయినా, ప్రత్యక్ష విచారణ అయినా కోర్టుల్లో న్యాయమూర్తుల ముందు అందరూ అత్యంత మర్యాదగా మసలుకుంటారు. అయితే ఇటీవల రాజస్థాన్ హైకోర్టు జైపూర్ బెంచ్ ముందు జరిగిన ఓ ఘటనపై దేశ వ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది. ఓ కేసులో వర్చువల్ విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ హుక్కా తాగుతూ కనిపించారు. స్వయంగా జస్టిస్ మహేంద్ర కుమార్ గోయల్ సమక్షంలోనే చోటుచేసుకున్న ఈ దృశ్యం కాస్తా కెమేరా కంటికి చిక్కింది. రాజస్థాన్‌‌కి చెందిన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై దాఖలైన ఓ పిటిషణ్‌పై మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ధవన్ ఓ పేపర్ అడ్డం పెట్టుకుని గప్పుగప్పుమని హుక్కా లాగించేశారు. ఆయన ఎంత దాచేందుకు ప్రయత్నించినా వీడియోలో పొగ వదులుతుండడం స్పష్టంగా కనిపించింది. దీంతో జస్టిస్ గోయల్ సదరు న్యాయవాదిని సున్నితంగా మందలించారు. అంత పెద్ద వయసులో పొగతాగడం ఆరోగ్యానికి మంచిది కాదనీ.. ఆ అలవాటు మానుకోవాలని సూచించారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో.. ‘‘నిప్పులేకుండా పొగ రాదు కదా..’’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు!



Updated Date - 2020-08-14T16:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising