బెంగాల్‌లో జరుగుతున్నదే యూపీలో జరుగుతోంది: కాంగ్రెస్
ABN, First Publish Date - 2020-12-11T21:16:35+05:30
బెంగాల్‌లో అధికార పక్షాన్ని తప్పుపడుతున్న వారు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్నదేమిటో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. అయితే రాష్ట్రపతి పాలనపై వినిపిస్తున్న వార్తలను ఆయన దగ్గర ప్రస్తావించగా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని అధిర్ అన్నారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిపై లోక్‌సభా ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఖండించారు. అయితే బెంగాల్‌లో జరుగున్నదే యూపీ సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుగుతోందని ఆయన అన్నారు. శాంతి భద్రతలు ఎక్కడ హననానికి గురైనా ఖండించాల్సిందేనని ఆయన గుర్తు చేశారు. బెంగాల్‌లో అధికార పక్షాన్ని తప్పుపడుతున్న వారు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్నదేమిటో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. అయితే రాష్ట్రపతి పాలనపై వినిపిస్తున్న వార్తలను ఆయన దగ్గర ప్రస్తావించగా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని అధిర్ అన్నారు.
‘‘గురువారం జరిగిన సంఘనలు రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. మనమంతా ఇలాంటి చర్యలను తప్పకుండా ఖండించాల్సిందే. కానీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరుగుతోంది. బెంగాల్‌లో అధికార పక్షాన్ని తప్పుపడుతున్న వారు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్నదేమిటో గుర్తు చేసుకోవాలి. ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని నా అభిప్రాయం’’ అని అధిర్ రంజన్ అన్నారు.
Updated Date - 2020-12-11T21:16:35+05:30 IST