ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం ధరల్ని రూ.2 నుంచి రూ.50 వరకు పెంచుతాం: సీఎం

ABN, First Publish Date - 2020-06-01T23:41:53+05:30

కోవిడ్-19 పాజిటివ్ కేసులు రెండు వేలకు పైగా ఉన్నాయి. అయితే యాక్టివ్ కేసులు అతి తక్కువగా ఉండడం గమనార్హం. దాదాపు రెండు వేల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఈరోజు నుంచి మద్యం అమ్మకాలు అమలులోకి రానున్నాయి. కాగా అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై ధరలు పెంచినట్లుగానే పంజాబ్‌లో కూడా పెంచబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ అన్నారు. అయితే మిగిలిన రాష్ట్రాల్లో లాగ మద్యంపై కోవిడ్ సెస్ కాకుండా అదనపు ఎక్సైజ్ సెస్ పెంచుతామని ఆయన పేర్కొన్నారు. కనిష్టంగా 2 రూపాయల నుంచి గరిష్టంగా 50 వరకు మద్యం ధరల్ని పెంచబోతున్నట్లు ప్రకటించారు. మద్యం రకాల్ని, పరిమాణాల్ని బట్టి ఈ ధరలు ఉండనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ సొమ్మును రాష్ట్రంలోని కోవిడ్-19 బాధితుల కోసం వినియోగించనున్నట్లు సీఎం తెలిపారు.


పంజాబ్‌లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రెండు వేలకు పైగా ఉన్నాయి. అయితే యాక్టివ్ కేసులు అతి తక్కువగా ఉండడం గమనార్హం. దాదాపు రెండు వేల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నదని ఈ గణాంకాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2020-06-01T23:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising