ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.100 కోట్ల విరాళం... ఈ వ్యాపార దిగ్గజం ఎవరో తెలుసుగా..!

ABN, First Publish Date - 2020-03-30T00:44:30+05:30

ప్రధాని మంత్రి సహాయ నిధికి ఆదానీ ఫౌండేషన్ తరపున 100 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: భారత్‌లోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ కోవిడ్-19 కట్టడికి తన వంతు సాయం చేశారు. ప్రధాని మంత్రి సహాయ నిధికి ఆదానీ ఫౌండేషన్ తరపున రూ.100 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు, ప్రభుత్వపరంగా కోవిడ్-19కి కట్టడికి తీసుకునే ప్రతీ చర్యకూ తమ వంతు సాయం చేస్తామని, పూర్తి సహకారం ఉంటుందని గౌతమ్ ఆదానీ స్పష్టం చేశారు. ఇప్పటికే తమ సంస్థ తరఫున రూ. 100 కోట్ల రూపాయల విరాళం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థ ప్రకటించింది. తమ కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగి.. తమ ఒక రోజు జీతాన్ని పీఎం సహాయ నిధికి విరాళంగా ఇవ్వడానికి అంగీకరించినట్లు ఆ సంస్థ తెలిపింది.


ఇదిలా ఉంటే.. కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటానికి అండగా నిలిచేందుకు టాటా గ్రూప్‌ ముందుకొచ్చింది. టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్టు రూ.500 కోట్ల సహాయక ప్యాకేజీని ప్రకటించాయి. కరోనాపై పోరాటానికి మద్దతుగా పలువురు సెలబ్రెటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే తమ వంతు సాయాన్ని ప్రకటించాయి.

Updated Date - 2020-03-30T00:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising