ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పును అంగీకరిస్తున్నాను..మాస్కు ధరిస్తాను..మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-09-24T16:49:01+05:30

మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా ‘‘నేను మాస్కు ధరించను’’అని చేసిన వ్యాఖ్యలపై తాను చింతిస్తున్నానని ప్రకటించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా ‘‘నేను మాస్కు ధరించను’’అని చేసిన వ్యాఖ్యలపై తాను చింతిస్తున్నానని ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో తాను మాస్కు ధరిస్తానని, తాను తప్పుగా వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరిస్తున్నానని మంత్రి మిశ్రా ప్రకటించారు. ‘‘ మాస్కు ధరించకూడదనే నా ప్రకటన చట్ట ఉల్లంఘనగా కనిపిస్తుంది. ఇది ప్రధానమంత్రి మనోభావాలకు అనుగుణంగా లేదు. నా తప్పును నేను అంగీకరిస్తున్నాను, విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను మాస్కు ధరిస్తాను. మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని  నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ’’అని మధ్యప్రదేశ్ మంత్రి మిశ్రా గురువారం ఉదయం హిందీలో ట్వీట్ చేశారు. 


గతంలో మంత్రి మిశ్రా ఇండోరులో విలేకరులతో మాట్లాడుతూ ‘‘నేను ఏ కార్యక్రమంలోనూ మాస్కు ధరించను, దీనివల్ల ఏమవుతోంది అని ప్రశ్నించారు. హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలు కురిపించారు.దీంతో మంత్రి మిశ్రా తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1.13 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 2,077 మంది మరణించారు.ఇండోరు నగరంలో అత్యధికంగా 20వేల మందికి కరోనా సోకడంతో మాస్కు ధరించని వారికి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 200 రూపాయల జరిమానా విధిస్తోంది. 



Updated Date - 2020-09-24T16:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising