ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్: ఏబీవీపీ సమావేశాలు రద్దు

ABN, First Publish Date - 2020-04-08T19:48:54+05:30

దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కీలక నిర్ణయం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏబీవీపీ వార్షిక శిక్షణా కార్యక్రమాలతో పాటు జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎన్‌ఈసీ)ని కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో మినహా ఎన్‌ఈసీ, శిక్షణా కార్యక్రమాలను ఏబీవీపీ వాయిదా వేయడం ఇదే ప్రథమం.


ఏడాది పొడవునా జరపాల్సిన కార్యాచరణ, ఎజెండాకు సంబంధించి మేలో జరపాల్సిన ఎన్‌ఈసీతో పాటు, 40 రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాలను కోవిడ్ నేపథ్యంలో వాయిదా వేసినట్టు ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి మీడియాకు తెలిపారు. విద్యాసంబంధిత సమస్యలు, స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌ల విషయంలోనూ పలు ఆందోళనలు ఉన్నాయని, విద్యార్థులకు మిడ్ డే మీల్స్‌తో పాటు వారి సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రికి మెమొరాండం ఇచ్చామని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు, వైస్ ఛాన్సలర్లకు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తామని ఆయన చెప్పారు. షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా 448 ప్రతినిధులు ఎన్ఈసీలో పాల్గొనాల్సి ఉంది.


కాగా, పీఎం-కేర్స్ నిధికి యువకులంతా విరాళాలు ఇవ్వాలని, తమ తోటివారికి కూడా చెప్పి సహాయం అందించేలా చూడాలని కూడా ఏబీవీపీ పిలుపునిచ్చింది. లాక్‌డౌన్ కారణంగా దేశంలో బ్లడ్ కొరత తలెత్తితే యువకులంతా రక్తదానం చేయాలని కోరింది.

Updated Date - 2020-04-08T19:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising