ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసు... పరారీలో ఉన్న కానిస్టేబుల్ అరెస్ట్...

ABN, First Publish Date - 2020-07-04T05:28:08+05:30

తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసులో నిందితుడుగా ఉన్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టుటికోరిన్: తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసులో నిందితుడుగా ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను ఇవాళ అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు రెండు రోజుల క్రితం పరారైన కానిస్టేబుల్ ముత్తురాజ్... టుటికోరిన్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని విలతికుళంలో ఓ సురక్షిత ప్రాంతంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇవాళ సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకుని టుటికోరిన్ తీసుకొచ్చామనీ.. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న సీబీ-సీఐడీ అధికారులకు అప్పగించామని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా ముత్తురాజ్ అరెస్టుతో ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసుల సంఖ్య ఐదుకు చేరింది. 


గత నెల 19న నిర్దేశించిన సమయానికి అదనంగా మరో 15 నిమిషాల పాటు మొబైల్ షాపు తెరిచి ఉంచారన్న కారణంగా పోలీసులు జయరాజ్ (59), అతడి కుమారుడు బెనిక్స్ (31)లను అరెస్ట్ చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత ఇద్దర్నీ చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. శరీరంపైనా, లోపలా తీవ్ర గాయాలు అయినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 22న సాయంత్రం 7.45కి బెనిక్స్‌ను ఓ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 9 గంటలకు మృతి చెందాడు. అయన తండ్రిని అదేరోజు రాత్రి 10 గంటలకు ఆస్పత్రిలో చేర్చగా.. మరుసటి రోజు ఉదయం 5.40కి మృతి చెందాడు. ఈ మరణాలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. అయితే సీబీఐ ఈ కేసుపై విచారణ చేపట్టేలోపు ఆధారాలు కనుమరుగయ్యే అవకాశం ఉన్నందున ఈలోగా సీబీ-సీఐడీ దర్యాప్తు చేపట్టాలంటూ మద్రాసు హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2020-07-04T05:28:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising