ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో 139 మందికి మంకీ ఫీవర్...ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2020-04-10T12:55:52+05:30

కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గా జిల్లాలో మంకీ జ్వరాలు విజృంభిస్తుండటం ఆందోళన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివమొగ్గా (కర్ణాటక): కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గా జిల్లాలో మంకీ జ్వరాలు విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. శివమొగ్గా జిల్లాలో 139 మందికి మంకీ జ్వరాలు రాగా, వీరిలో ముగ్గురు మరణించారని ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేబీ శివకుమార్ చెప్పారు. మంకీ జ్వరాలు వచ్చిన వారిలో 130 మందికి చికిత్స చేయడంతో వారు కోలుకున్నారని శివకుమార్ పేర్కొన్నారు. మంకీ జ్వరం వల్ల ఒక రోగి మరణించాడని తేలిందని, మరో ఇద్దరు రోగులు కూడా మరణించారని, వారి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని కమిషనర్ చెప్పారు. గత ఏడాది శివమొగ్గా జిల్లాలో ప్రబలిన మంకీ జ్వరాలు 400 మందికి రాగా, ఇందులో 23 మంది మరణించారు. శివమొగ్గా అడవుల్లోని కోతుల ద్వార వస్తున్న ఈ మంకీ జ్వరాలు ఈ ఏడాది కూడా ప్రబలడంతో ప్రజలు కలవరపడుతున్నారు. 


Updated Date - 2020-04-10T12:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising