ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు.. జర్నైల్ సింగ్‌పై ఆప్ సస్పెన్షన్ వేటు..

ABN, First Publish Date - 2020-08-13T21:36:38+05:30

ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌పై అధికార ఆమాద్మీ పార్టీ (ఆప్) అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌పై అధికార ఆమాద్మీ పార్టీ (ఆప్) అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఓ వర్గంపై ఫేస్‌బుక్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాజౌరీ గార్డెన్ మాజీ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌కు‌.. సిక్కుల్లో కీలక నేతగా పేరుంది. హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్న ఓ ఫోటో ఆయన ఫేస్‌బుక్‌లో కనిపించడంతో తీవ్ర వివాదం రేగింది. అయితే తన కుమారుడు పొరపాటున దాన్ని షేర్ చేశాడంటూ ఆయన దాన్ని డిలీట్ చేశారు. దీనిపై ఆమాద్మీ పార్టీ స్పందిస్తూ... ‘‘ఆమాద్మీ పార్టీ ఓ సెక్యులర్ పార్టీ. ఇందులో ఎలాంటి మత వివక్షకు చోటులేదు. సిక్కు మతస్తులు సైతం బాధపడే విధంగా ఆయన చేసి వ్యాఖ్యలు ఉన్నాయి. ఓ వర్గాన్ని కించపర్చేలా మాట్లాడడం గురునానక్ దేవ్ బోధలకు కూడా విరుద్ధం...’’ అని పేర్కొంది. 

Updated Date - 2020-08-13T21:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising