ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14ఏళ్ల వయసులో నాపై లైంగిక దాడి

ABN, First Publish Date - 2020-11-03T07:23:00+05:30

తన 14ఏళ్ల వయసులో లైంగిక దాడికి గురయ్యాయని బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌(23) తాజాగా వెల్లడించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అమీర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా వెల్లడి


ముంబై, నవంబరు 2: తన 14ఏళ్ల వయసులో లైంగిక దాడికి గురయ్యాయని బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌(23) తాజాగా వెల్లడించారు. తనపై ఆ దాడికి పాల్పడింది బాగా తెలిసిన వ్యక్తేనని పేర్కొన్నారు. ‘‘నాకు 14ఏళ్లు ఉన్నప్పుడు నాపై లైంగిక దాడి జరిగింది. ఆ వయసులో నాకు అది అర్థం కాలేదు. ఏడాది అనంతరం అసలు విషయం అర్థమై మా తల్లిదండ్రులకు వెంటనే ఈమెయిల్‌ పెట్టాను. వారి సహాయంతో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాను. ఆ ఘటన గురించి ఇప్పుడు ఆలోచన లేదు కానీ.. నాకు తెలియకుండా అయినా సరే, అలా జరగనిచ్చినందుకు గతంలో అప్పుడప్పుడూ నన్ను నేను కొట్టుకునేదానిని. ప్రస్తుతం ఆ ఘటన తాలూకు జ్ఞాపకాల్ని వదిలేసి జీవితంలో ముందుకు సాగుతున్నా’’ అని ఐరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పది నిముషాల నిడివి గల వీడియోలో తెలిపారు. తాను నైరాశ్యంతో పోరాడుతున్నానని నెల రోజుల క్రితం ఐరా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమీర్‌ఖాన్‌, ఆయన మొదటి భార్య రీనా దత్తాలకు 1997లో ఐరా జన్మించారు. 

Updated Date - 2020-11-03T07:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising