ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తబ్లిగ్ జమాత్‌పై కేంద్రమంత్రి నఖ్వీ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-04-01T18:18:24+05:30

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమైన నిజాముద్దీన్ తబ్లిగ్ జమాత్‌పై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమైన నిజాముద్దీన్ తబ్లిగ్ జమాత్‌పై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ మార్చి 13 నుంచి 15వతేదీ వరకు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగ్ జమాత్ సమావేశాలు నిర్వహించడం తాలిబాన్ నేరానికి తక్కువ కాదని, దీనిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని మంత్రి నఖ్వీ కోరారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మైనారిటీలతో సహా ప్రజలు మద్ధతు ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.


కరోనా వైరస్ పై పోరాడుతున్న వేళ తబ్లిగ్ జమాత్ సమావేశాలు నిర్వహించడం నేరమని, సర్వశక్తిసంపన్నుడు అయిన అల్లాహ్ కూడా దీన్ని క్షమించడని, వారి అజాగ్రత్తల వల్ల చాలామంది ప్రాణాలు ప్రమాదంలో పడటం దురదృష్టకరమని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. కరోనా ప్రబలకుండా శుక్రవారం నమాజ్ మసీదుల్లో చేయరాదని, వారి వారి ఇళ్లలోనే చేయాలని ముస్లిములందరూ  స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారని, అలా జమాత్ సమావేశాన్ని ఎందుకు వాయిదా వేసుకోలేదని కేంద్రమంత్రి ప్రశ్నించారు. 


Updated Date - 2020-04-01T18:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising