ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడా పార్లమెంటు నుంచి సిక్కు ఎంపీ జగ్మీత్‌ సస్పెన్షన్

ABN, First Publish Date - 2020-06-19T04:03:52+05:30

కెనడా పార్లమెంటు సభ్యుడు, భారత సంతతి నేత జగ్మీత సింగ్‌ పార్లమెంటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కెనడా పార్లమెంటు సభ్యుడు, భారత సంతతి నేత జగ్మీత సింగ్‌ పార్లమెంటు నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. సహచర ఎంపీని జాత్యహంకారి అని ఆరోపించినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నారు. 


కెనడా మీడియా కథనాల ప్రకానం, పోలీసు దళంలో వ్యవస్థీకృత జాత్యహంకారాన్ని గుర్తించాలనే తీర్మానాన్ని ఆమోదించేందుకు నిరాకరించడంతో ఓ ఎంపీని జగ్మీత్ జాత్యహంకారి అని ఆరోపించారు. దీంతో ఆయనను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారు. సింగ్ ఒక రోజు పార్లమెంటు సమావేశాలకు హాజరు కారాదని హౌస్ స్పీకర్ రోటా తెలిపారు. 


న్యూ డెమొక్రాటిక్ పార్టీ నేత, సస్పెన్షన్‌కు గురైన జగ్మీత్ సింగ్ మాట్లాడుతూ, తాను తన మాటలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. బ్లాక్ క్వెబెకోయిస్ హౌస్ లీడర్ అలెయిన్ థెర్రీన్‌ను జాత్యహంకారి  అని అభివర్ణించానని, ఆ మాటలకు తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్‌లో వ్యవస్థీకృత జాత్యహంకారాన్ని గుర్తించాలని కోరుతున్న తీర్మానానికి అవసరమైన ఆమోదాన్ని నిరాకరించినందుకు అలెయిన్‌ను తాను జాత్యహంకారి అన్నానని తెలిపారు. ఆ సమయంలో తాను తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని, అయితే ఆ మాటలకు తాను కట్టుబడి ఉంటానని అన్నారు. 


Updated Date - 2020-06-19T04:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising