ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19 రోగుల రక్త నమూనాలను లాక్కెళ్ళిన కోతి

ABN, First Publish Date - 2020-05-30T00:23:56+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ కోతి అత్యంత ప్రమాదకరమైన చర్యకు పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ కోతి అత్యంత ప్రమాదకరమైన చర్యకు పాల్పడింది. మీరట్‌లోని లాలా లజపతిరాయ్ వైద్య కళాశాల ల్యాబ్ టెక్నీషియన్ నుంచి శుక్రవారం కోవిడ్-19 రోగుల రక్త నమూనాలను లాక్కెళ్ళింది. 


రక్త నమూనాతో కూడిన ఓ తెల్లని పొట్లాన్ని ఆ కోతి నములుతున్న దృశ్యం ఓ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 


వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌కే గార్గ్ మాట్లాడుతూ, ఈ సంఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. తాము ల్యాబ్ టెక్నీషియన్‌ను వివరాలు అడిగామన్నారు. కోతి పట్టుకెళ్ళినవి గొంతు, నాలుకకు సంబంధించిన స్వాబ్ శాంపిల్స్ కావని, అవి రొటీన్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా కోవిడ్-19 రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలని తెలిపారు. కోవిడ్-19 శాంపిల్స్‌ను ఓ పెట్టెలో భద్రపరిచారని, వీటిని ఆ విధంగా చేయలేదని వివరించారు. 


కోతుల ద్వారా కోవిడ్-19 వ్యాపిస్తుందనే భయాందోళన అక్కర్లేదని వైద్యాధికారులు భరోసా ఇచ్చారు. 


జంతువుల నుంచి కోవిడ్-19 వ్యాపిస్తున్నట్లు సాక్ష్యాధారాలు లేవని  గార్గ్ తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళనకు గురికానక్కర్లేదని స్పష్టం చేశారు. 


Updated Date - 2020-05-30T00:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising