ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో కరోనాను జయించిన 96 ఏళ్ల వృద్ధురాలు

ABN, First Publish Date - 2020-07-08T05:04:46+05:30

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెడుతున్న వేళ కర్ణాటకలో 96 సంవత్సరాల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెడుతున్న వేళ కర్ణాటకలో 96 సంవత్సరాల ఓ వృద్ధురాలు కరోనాను జయించి బెంబేలెత్తిపోతున్న ప్రజల్లో కొత్త ధైర్యాన్ని నింపింది. బెంగళూరుకు దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరియుర్ పట్టణానికి చెందిన 96 ఏళ్ల వృద్ధురాలికి కరోనా సోకింది. ఆమెను చిత్రదుర్గ జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో జూన్ 27న చేర్చారు.


ఆమె కరోనా నుంచి కోలుకుని మంగళవారం డిశ్చార్జ్ అయింది. ఆమె కోలుకోవడంపై ఆసుపత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆమెను గౌరవంగా అంబులెన్స్ ఎక్కించి హిరియుర్‌కు పంపారు. ఢిల్లీలో కూడా 106 సంవత్సరాల వయసున్న ఓ వృద్ధుడు ఇటీవల కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఇలా కరోనా సోకిన వృద్ధులు తిరిగి కోలుకోవడం కొంత ఊరట కలిగించే విషయం. 

Updated Date - 2020-07-08T05:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising