దేశంలో కొత్తగా 94,372 కేసులు
ABN, First Publish Date - 2020-09-14T06:46:44+05:30
వరుసగా మూడు రోజులు దేశంలో 95 వేలపైనే నమోదైన కరోనా కేసులు శనివారం కాస్త తగ్గాయి. ఆదివారం ఉదయం 8
కొవిడ్‌తో మరో 1,114 మంది మృతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: వరుసగా మూడు రోజులు దేశంలో 95 వేలపైనే నమోదైన కరోనా కేసులు శనివారం కాస్త తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 10.71లక్షల మందికి పరీక్షలు చేయగా 94,372 మందికి వైరస్ సోకిందని.. 1,114 మంది మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 24గంటల్లో 78,399 మంది కోలుకున్నారని తెలిపింది. రికవరీ రేటు 77.88కి చేరందని.. మరణాల రేటు 1.65కు తగ్గిందని పేర్కొంది. మహారాష్ట్రలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు.
సెప్టెంబరులో 25 లక్షలపైనే కేసులు..!
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారత్‌లో సెప్టెంబరు నెల 12 రోజుల్లోనే పది లక్షలపైగా కేసులు, 13 వేల మరణాలు నమోదయ్యాయి. నెలాఖరుకు మరో 5 లక్షల పాజిటివ్‌లు వస్తాయని అనుకున్నా.. ఒక్క సెప్టెంబరులోనే 25 లక్షల కేసులు నమోదైనట్లు అవుతుంది. కాగా, తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన ప్రముఖ కార్మిక, వామపక్ష నేత, మాజీ ఎమ్మెల్యే కె.తంగవేలు (68) కరోనాతో ఆదివారం చనిపోయారు.
గంజి తాగి.. కోలుకున్న 105ఏళ్ల వృద్ధురాలు
‘గంజి నీళ్లయినా తాగి బతకొచ్చు..’ ఆత్మగౌరవం దెబ్బతినే సందర్భంలో సహజంగా ఉపయోగించే మాట ఇది. ఈ కరోనా కాలంలో కర్ణాటక కొప్పల్ జిల్లాకు చెందిన కమలమ్మ లింగనగౌడ హీరేగౌడర్ విషయంలో పై మాట అన్వయాన్ని కొంచెం మార్చి చెప్పుకోవాల్సి ఉంటుందేమో. ఎందుకంటే.. 105 ఏళ్ల వృద్ధురాలైన కమలమ్మ గత వారం కరోనా బారినపడ్డారు. వయసు రీత్యా ఆమె ఆస్పత్రిలో చేరాలి.
కానీ, కమలమ్మ ఒప్పుకోలేదు. కరోనాను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనాలని భావించారు. ఆహారం తీసుకోకుండా.. కేవలం గంజి, నీరు తాగుతూ వైద్యులు సూచించిన మందులను పరిమితంగా తీసుకున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో పది రోజుల్లోనే ఆమెకు వైర్‌సను జయించారు. వృత్తి రీత్యా వైద్యుడైన కమలమ్మ మనవడు శ్రీనివాస్ హ్యాతి.. బామ్మ సంరక్షణను చూసుకున్నారు.
Updated Date - 2020-09-14T06:46:44+05:30 IST