ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో వృద్ధుడి టీకొట్టు వ్యాపారం! పోలీసులు వేసిన శిక్ష ఏంటంటే..

ABN, First Publish Date - 2020-04-26T03:40:09+05:30

రెక్కాడితేగానీ డొక్కాడని వారు లాక్ డౌన్ కారణంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒడిశాలో జరిగిన ఈ ఉదంతం తెలిస్తే ఇట్టే అర్థమవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్‌కతా: రెక్కాడితేగానీ డొక్కాడని వారు లాక్ డౌన్ కారణంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒడిశాలో జరిగిన ఈ ఉదంతం తెలిస్తే ఇట్టే అర్థమవుతుంది. స్థానిక ఎంటల్లీ ప్రాంతంలో ఓ వృద్ధుడు లాక్ డౌన్‌లో కూడా టీకొట్టు తెరిచాడు. అతడు 86 ఏళ్ల వయసున్న పండు ముసలి. అయితే కొట్టు తెరిస్తే గానీ కడుపు నిండని పరిస్థితి ఉండటంతో అతడు నిబంధనలను ధిక్కరించి మరీ వ్యాపారం కొనసాగించాడు. దీంతో ఆ కొట్టు చుట్టు అనేక మంది గుమిగూడటం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు వృద్ధుడిని చూడగానే విషయం అర్థమైంది. అతడి దయనీయస్థితి వారిని హృదయాలను కలచివేసింది. బతికేందుకు అతడికి  మరోదారి చూపించకుండా వృద్ధుడిచేత కొట్టు మూయించలేమని వారు అర్థం చేసుకున్నారు. దీంతో వారు అతడికి మూడు కేజీల బియ్యం, పప్పులు అందించారు. లాక్ డౌన్ ఎత్తివేసే వరకూ ఇంట్లోనే ఉండాలంటూ అతడికి ‘శిక్ష’  వేసి పంపించారు. 


Updated Date - 2020-04-26T03:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising