ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన 75 మంది విదేశీయులకు బెయిలు

ABN, First Publish Date - 2020-07-12T00:58:03+05:30

ఢిల్లీలోని తబ్లిగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 75 మంది థాయిలాండ్, నేపాల్ వాసులకు ఢిల్లీ కోర్టు శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తబ్లిగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 75 మంది థాయిలాండ్, నేపాల్ వాసులకు ఢిల్లీ కోర్టు శనివారం బెయిలు మంజూరు చేసింది. వీసా నిబంధనలు ఉల్లంఘించి తబ్లిగి కార్యక్రమానికి హాజరైన వీరిపై చార్జిషీట్ దాఖలైంది. కొవిడ్-19 మార్గదర్శకాలను ఉల్లంఘించడంతోపాటు మిషనరీ కార్యకలాపాలను చట్టవ్యతిరేకంగా నిర్వహిస్తున్నట్టు వీరిపై అభియోగాలు నమోదయ్యాయి. శనివారం వీరికి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గుర‌మోహిన కౌర్ ఒక్కొక్కరికి రూ. 10 వేల వ్యక్తిగత బాండ్‌పై బెయిలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 33 దేశాలకు చెందిన 445 మంది విదేశీయులకు బెయిలు లభించింది. పోలీసులు గత నెలలో 36 దేశాలకు చెందిన 956 మందిపై 59 చార్జిషీట్లు దాఖలు చేశారు. 

Updated Date - 2020-07-12T00:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising