ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో మరో 74 కరోనా కేసులు.. 73 మంది మర్కజ్‌కు వెళ్లినవారే!

ABN, First Publish Date - 2020-04-05T01:48:54+05:30

దేశంలో కరోనా మహమ్మారిని చాలావరకు నియంత్రించామని సంబరపడిన ప్రభుత్వాలకు మార్చి నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమం చేదు అనుభవాన్నే మిగిల్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: దేశంలో కరోనా మహమ్మారిని చాలావరకు నియంత్రించామని సంబరపడిన ప్రభుత్వాలకు మార్చి నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమం చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఎందుకంటే నిజాముద్దీన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలామందికి కరోనా వైరస్ సోకింది. దేశంలో నమోదైన ప్రతి మూడు కరోనా కేసుల్లో ఒకరు ఈ కార్యక్రమానికి వెళ్లొచ్చారని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతోనే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. దీనికి మరో ఉదాహరణ తమిళనాడు ప్రభుత్వం చేసిన తాజా ప్రకటన. తమ రాష్ట్రంలో మరో 74 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని తమిళనాడు ఆరోగ్యశాఖ సెక్రెటరీ బీలా రాజేశ్ ప్రకటించారు. అయితే వీరిలో 73మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారేనట. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 485కు చేరిందని, వీటిలో 437 కేసులకు తబ్లిగీ జమాత్‌ కార్యక్రమంతో సంబంధాలున్నాయని ఆమె వెల్లడించారు. ఇప్పటి వరకు తమిళనాడులో కరోనా వైరస్ కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-04-05T01:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising