ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్షలు వద్దే వద్దు.. 70 వేల మంది విద్యార్థుల గళం!

ABN, First Publish Date - 2020-05-18T21:35:12+05:30

కళాశాల స్థాయిలో పరీక్షలను రద్దు చేయాలంటూ దాదాపు 70 వేల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో గళమెత్తారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కళాశాల స్థాయిలో పరీక్షలను రద్దు చేయాలంటూ దాదాపు 70 వేల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో గళమెత్తారు. ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్ ద్వారా పోర్షన్లను పూర్తిచేయాలని, జూన్ మొదటి వారంలో పరీక్ష తేదీలను ప్రకటిస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్.. వైస్ చాన్స్‌లర్లు, ఇనిస్టిట్యూట్ల హెడ్‌లకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విద్యార్థులు ఇలా స్పందించారు. 


పరీక్షలు నిర్వహించకుండానే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను తర్వాతి తరగతులకు  ప్రమోట్ చేయాలని ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంతకాలు చేసిన విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే, ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో మాత్రం తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. 70 శాతం పోర్షన్ పెండింగులో ఉందని, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏమి బోధిస్తారో అర్థం కావడం లేదని అన్నారు. నోట్స్ ఆన్‌లైన్‌లో పంపారని, దానిని తాము సొంతంగా చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ పరీక్షలంటే పేద విద్యార్థులపై వివక్ష చూపడమే అవుతుందని, వారికి సరైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ సరిగా ఉండదని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనపై డిప్యూటీ సీఎం ఇప్పటి వరకు స్పందించలేదు.  


Updated Date - 2020-05-18T21:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising