కరోనాతో మృతి చెందిన తొలి వ్యక్తి.. 100 మందిని కలిశాడు.. 23 మందికి వైరస్ అంటించాడు..
ABN, First Publish Date - 2020-03-28T00:45:44+05:30
కరోనా బారిన పడి పంజాబ్ రాష్ట్రంలో 70 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఇది పంజాబ్ మొట్టమొదటగా నమోదైన కరోనా మరణం. అయితే ఆశ్చర్యకరమైన...
రాష్ట్రంలోని మొత్తం కేసులు 33
పంజాబ్: కరోనా బారిన పడి పంజాబ్ రాష్ట్రంలో 70 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఇది పంజాబ్ మొట్టమొదటగా నమోదైన కరోనా మరణం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికి రాష్ట్రంలో మొత్తం 33 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 23 మందికి ఇతడి ద్వారానే కరోనా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్‌లకు వెళ్లి తిరిగి వచ్చిన అతడిని వైద్యాధికారులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. అయితే అతడు వారి ఆదేశాలను పట్టించుకోకుండా బయట తిరిగాడు. ఓ 100 మందిని కలిశాడు. అలా అతడు ఎవరినైతే కలిశాడని అనుమానాలున్నాయో వారిలోని 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇదిలా ఉంటే బలదేవ్ సింగ్‌తో కలిసి మరో ఇద్దరు ప్రబోధకులు కూడా విదేశాలు తిరిగి వచ్చారు. వీరందరినీ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండమని అధికారులు ఆదేశించినా వారు పెడచెవిన పెట్టారు. అనేక గ్రామాల్లో తిరిగారు. ఎంతో మందిని కలిశారు. ప్రస్తుతం బలదేశ్ సింగ్ మరణించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అతడితో పాటు మిగతా ఇద్దరితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరించడంలో తలమునకలవుతున్నారు.
Updated Date - 2020-03-28T00:45:44+05:30 IST