ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలోని కొవిడ్ మరణాల్లో 70 శాతం పురుషుల్లోనే!

ABN, First Publish Date - 2020-12-30T01:33:20+05:30

దేశంలోని మొత్తం కొవిడ్ మరణాల్లో 70 శాతం పురుషుల్లో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 60 ఏళ్ల లోపు వారిలో 45 శాతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం కొవిడ్ మరణాల్లో 70 శాతం పురుషుల్లో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 60 ఏళ్ల లోపు వారిలో 45 శాతం మరణాలు నమోదైనట్టు పేర్కొంది. అలాగే, ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 63 శాతం పురుషుల్లో, 37 శాతం స్త్రీలలో నమోదైనట్టు వివరించింది. ఆరు నెలల తర్వాత దేశంలో తొలిసారి రోజువారీ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 17 వేలకు తక్కువగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 2.7 లక్షల దిగువన ఉన్నట్టు చెప్పారు. గత వారం రోజులుగా దేశంలో పాజిటివిటీ రేటు 2.25 శాతం ఉండగా, మొత్తంగా 6.02 శాతం ఉన్నట్టు వివరించారు. 


ఆరు నెలల తర్వాత రోజువారీ కొవిడ్ మరణాల సంఖ్య 300 కంటే తక్కువ నమోదైనట్టు భూషణ్ తెలిపారు. 55 శాతం మరణాలు 60 ఏళ్లు, ఆ పైబడిన వారిలో సంభవించగా, 70 శాతం మరణాలు పురుషుల్లో సంభవించినట్టు పేర్కొన్నారు. 17 ఏళ్ల లోపు వారిలో 8 శాతం, 18-25 ఏళ్ల మధ్య వారిలో 13 శాతం, 26-44 వయసు మధ్య వారిలో 39 శాతం, 45-60 వయసు వారిలో 26 శాతం, 60 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం కరోనా కేసులు నమోదైనట్టు భూషణ్ వివరించారు.   


Updated Date - 2020-12-30T01:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising