ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా దెబ్బ: దేశంలోని 62% కుటుంబాల్లో చదువు ఢమాల్!

ABN, First Publish Date - 2020-07-13T15:15:55+05:30

కరోనా దెబ్బకు విద్యారంగం డిజిటల్ బాట పట్టింది. ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరుగుతోంది అయితే ఈ పరిణామాల కారణంగా సమాజంలోని ఆర్థిక అంతరాలు మరింత ప్రస్ఫుటమై విద్యార్థులపై పెను ప్రభావం చూపుతున్నాయని ఇటీవల చేపట్టిన సర్వేలో వెల్లడైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు విద్యారంగం డిజిటల్ బాట పట్టింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన జరుగుతోంది. అయితే ఈ పరిణామాలు.. సమాజంలోని ఆర్థిక అంతరాలను మరింత పెంచి విద్యార్థులపై పెను ప్రభావం చూపిస్తున్నాయని ఇటీవల చేపట్టిన ఓ సర్వేలో వెల్లడైంది.


దేశంలో ఏకంగా 62 శాతం కుటుంబాల్లో పిల్లల చదువు మధ్యలోనే ఆగిపోయిందని, ఆన్‌లైన్‌ విద్య కారణంగా విద్యార్థుల్లో చదువుపై నిర్లక్ష్యం కూడా పెరిగిందని ఈ సర్వేలో బయటపడింది. సేవ్ ద చిల్డ్రన్ అనే స్వచ్ఛంధ సంస్థ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 15 రాష్ట్రాల్లోని 7,235 కుటుంబాల పరిస్థితులను పరీశింలించిన అనంతరం సదరు సంస్థ ఈ నివేదికను రూపొందించింది.


ఈ డిజిటల్ విద్యాబోధన ఉత్తర భారత దేశం విద్యార్థులపై అధికంగా ప్రభావం చూపించినట్టు నివేదికలో వెల్లడైంది. దక్షిణ భారత దేశంలో డిజిటలీకరణ ప్రభావం కాస్తంత తక్కువగానే ఉన్నట్టు తేలింది. ఇక స్కూళ్లు మూతపడటంతో తమకు మధ్యాహ్న భోజనం అందటంలేదని దాదాపు 20 శాతం కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇళ్లలో చదువు కారణంగా ప్రతి పదిమంది విద్యార్థుల్లో నలుగురు చదువుతో పాటు ఆటపాటల్లోనూ మునిగి తేలుతున్నట్టు వెల్లడైంది. 

Updated Date - 2020-07-13T15:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising