ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు పుజప్పుర సెంట్రల్ జైల్‌లో 59 మందికి కరోనా..!

ABN, First Publish Date - 2020-08-13T04:25:35+05:30

తమిళనాడులోని పుజప్పుర సెంట్రల్ జైల్లోని 59 మంది ఖైదీలు కరోనా బారినపడ్డట్టు తాజాగా వెల్లడైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రివేండ్రమ్: తమిళనాడులోని పుజప్పుర సెంట్రల్ జైల్లోని 59 మంది ఖైదీలు కరోనా బారినపడ్డట్టు తాజాగా వెల్లడైంది. దీంతో అధికారులు కరోనాను ఎలా అదుపు చేయాలో తెలీని స్థితిలో పడిపోయారు. మొత్తం 97 మందికి కరోనా యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా..59 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. ఆగస్టు పదిన ఓ ఖైదీ వైరస్ బారిన పడ్డాడని తెలియడంతో జైలు అధికారులు ఖైదీలకు విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కొంత మంది ఖైదీలు కరోనా కాటుకు గురైనట్టు వెల్లడైంది. ప్రస్తుతం ఆ జైల్లో మొత్తం 1100 మంది ఖైదీలు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, జైలు ఆడిటోరియంను క్వారంటైన్ కేంద్రంగా మారుస్తామని జైలు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా అనేక జైళ్లలో పదుల సంఖ్యలో ఖైదీలు కరోనా బారినపడుతుండటం అధికారులకు పెను సవాలుగా మారింది.

Updated Date - 2020-08-13T04:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising