ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ భద్రతా చట్టం కింద 1,200 మంది అరెస్టయ్యారు : కిషన్ రెడ్డి

ABN, First Publish Date - 2020-09-21T22:56:03+05:30

2017,18 సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా 1,200 మందిని జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అదుపులోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : 2017,18 సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా 1,200 మందిని జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. 1,200 మందిలో 563 మంది ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆయన రాజ్యసభలో ప్రకటించారు. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో ప్రకారం జాతీయ భద్రతా చట్టం కింద మధ్యప్రదేశ్ లో ఎక్కువ మందిని అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత యూపీ రెండో స్థానంలో ఉందని ఆయన తెలిపారు.


దేశ వ్యాప్తంగా 2017 లో 501 మందిని అదుపులోకి తీసుకున్నారని, 229 మందిని విడుదల చేశామని, 272 మంది ఇంకా కస్టడీలోనే ఉన్నారన్నారు. 2018 లో 697 మందిని అరెస్ట్ చేస్తే, 406 మందిని విడుదల చేశారని, 291 మంది కస్టడీలోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక మధ్యప్రదేశ్ లో 795 మందిని అదుపులోకి తీసుకోగా 466 మందిని విడుదల చేశామని, 329 మంది ఇంకా కస్టడీలోనే ఉన్నారని కిషన్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. 

Updated Date - 2020-09-21T22:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising