ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'5.5 లక్షల భారతీయుల ఉద్యోగాలు ఔట్'

ABN, First Publish Date - 2020-12-30T00:48:38+05:30

'5.5 లక్షల భారతీయుల ఉద్యోగాలు ఔట్'

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నిష్ణాతుల సేవల కోసం భారతదేశపు సుప్రసిద్ధ ఏఐ ఆధారిత టెక్‌ ప్లాట్‌ఫామ్‌ సులేఖ డాట్‌ కామ్‌ అత్యంత ఆసక్తికరమైన ధోరణులను మరియు సేవా విభాగాల గురించి పరిజ్ఞానాన్ని వెల్లడించింది. దేశంలోని అగ్రశ్రేణి 8 నగరాల నుంచి సులేఖకు వచ్చిన దాదాపు 8 లక్షల మంది యూజర్లు (జూలై–సెప్టెంబర్‌) నుంచి ఓఎన్‌డీ(అక్టోబర్‌–డిసెంబర్‌) మధ్య సందర్శనలు మరియు సెర్చ్‌ల ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేశారు.


ఆన్‌లైన్‌ సెర్చ్‌లలో వృద్ధి చేసిన టాప్‌ 3 సర్వీస్‌ విభాగాలలో గృహ సహాయ సేవలు, ప్లేస్‌మెంట్‌ కన్సల్టెన్సీలు మరియు పోటీ పరీక్షల శిక్షణ ఉన్నాయి. మహమ్మారి కారణంగా, అధికశాతం మంది ప్రజలు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారని, ఇది స్పష్టంగా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు మరియు గృహ సహాయ సేవలకు డిమాండ్‌ పరంగా వృద్ధిని సూచించింది. జూలై–సెప్టెంబర్‌ 2020 మరియు అక్టోబర్‌ –డిసెంబర్‌ 2020 నడుమ సేవా విభాగాలలో ఆన్‌లైన్‌ వెదుకులాట పరంగా వృద్ధిని సరిపోల్చినప్పుడు ఈ సేవలు టాప్‌ 8 నగరాలలో 95శాతం వృద్ధి చెందాయని సులేఖ డాట్ కామ్ పేర్కొంది.


సేవా విభాగాల వ్యాప్తంగా ఆన్‌లైన్‌ సెర్చ్‌లో అగ్రశ్రేణిలో నిలిచిన ఐదు నగరాలలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై అనుసరించి హైదరాబాద్‌, చెన్నై ఉన్నాయని తెలిపింది. ఢిల్లీలో, టాప్‌ 3 సేవలలో గృహ సహాయ సేవలు, ప్లేస్‌మెంట్‌ కన్సల్టెన్సీలు, ఉద్యోగ శిక్షణ ఉన్నాయని పేర్కొంది. బెంగళూరులో టాప్‌ 3 సేవలలో ప్లేస్‌మెంట్‌ కన్సల్టెన్సీలు మరియు గృహ సహాయ సేవలు మరియు పేయింగ్‌ గెస్ట్‌ సేవలు ఉన్నాయి. ముంబైలో టాప్‌ 3 సేవలలో ప్లేస్‌మెంట్‌ కన్సల్టెన్సీలు మరియు ఉద్యోగ శిక్షణ మరియు వాహన అద్దె సేవలు ఉన్నాయని సులేఖ డాట్ కామ్ వెల్లడించింది. హైదరాబాద్‌లో టాప్‌ 3 సేవలలో గృహ సహాయ సేవలు, వాహన అద్దెలు మరియు ప్లేస్‌మెంట్‌ కన్సల్టెన్సీలు  ఉన్నాయని చెప్పింది. చెన్నైలో టాప్‌ 3 సేవలలో పేయింగ్‌ గెస్ట్‌ సేవలు, గృహ సహాయ సేవలు మరియు ప్లేస్‌మెంట్‌ కన్సల్టెన్సీలు ఉన్నాయి. 


‘సీఎంఐఈ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనమీ) నివేదిక ప్రకారం 5.5 లక్షల మంది భారతీయులు అక్టోబర్‌ 2020లో తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు సులేఖ డాట్‌ కామ్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో సత్య ప్రభాకర్‌ చెప్పారు. ఇది మా అధ్యయనంలో సైతం ప్రతిబింబించిందని పేర్కొన్నారు. సేవా విభాగాలైనటువంటి ప్లేస్‌మెంట్‌ కన్సల్టెన్సీలు, ఉద్యోగ శిక్షణ కోసం ఆన్‌లైన్‌ సెర్చ్‌ పరంగా వృద్ధి చూశామని, ఆసక్తికరంగా, వాహన అద్దెల కోసం వెదుకుతున్న ప్రజల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు.  మరీ ముఖ్యంగా అన్‌లాక్‌ కాలం వృద్ధి చెందుతున్న కొద్దీ ఇది మరింతగా కనబడిందని సత్య ప్రభాకర్ అన్నారు.



Updated Date - 2020-12-30T00:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising