ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హ్యాండ్ శానిటైజర్ల తయారీకి 45 డిస్టిలరీలకు అనుమతులు

ABN, First Publish Date - 2020-03-27T02:08:02+05:30

కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధం కోసం హ్యాండ్ శానిటైజర్లకు గిరాకీ పెరిగింది. దీంతో వీటిని తయారు చేయగలిగే డిస్టిలరీలు, పంచదార మిల్లులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధం కోసం హ్యాండ్ శానిటైజర్లకు గిరాకీ పెరిగింది. దీంతో వీటిని తయారు చేయగలిగే డిస్టిలరీలు, పంచదార మిల్లులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసి, పెద్ద మొత్తంలో హ్యాండ్ శానిటైజర్లను తయారు చేయాలని కోరుతోంది. తాజాగా 45 డిస్టిలరీలకు, 564 మాన్యుఫాక్చరింగ్ సంస్థలకు వీటి తయారీకి అనుమతులు మంజూరు చేసింది. మరొక 55 డిస్టిలరీలకు ఒకట్రెండు రోజుల్లో అనుమతులు మంజూరు చేయబోతోంది. 


ఇథనాల్ లేదా ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ) ఉత్పత్తికి అనుమతుల మంజూరులో అడ్డంకులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఎక్సయిజ్ కమిషనర్లు, చెరకు కమిషనర్లు, డ్రగ్ కంట్రోలర్లు, జిల్లా కలెక్టర్లు తదితర అధికారులను ఈ విధంగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో హ్యాండ్ శానిటైజర్ల తయారీకి 45 డిస్టిలరీలకు, 564 మాన్యుఫాక్చరింగ్ సంస్థలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపింది. మరొక 55 డిస్టిలరీలకు రానున్న రెండు రోజుల్లో అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. 


ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచేందుకు మూడు షిఫ్టుల్లో పని చేయాలని ఈ డిస్టిలరీలకు, మాన్యుఫ్యాక్చరర్లకు సూచించినట్లు పేర్కొంది. అనుమతులు పొందిన సంస్థల్లో కొన్ని ఇప్పటికే శానిటైజర్ల ఉత్పత్తిని ప్రారంభించాయని, మిగిలిన సంస్థలు మరో వారంలో ఉత్పత్తిని మొదలుపెడతాయని తెలిపింది.  ఈ చర్యల ఫలితంగా వినియోగదారులు, ఆసుపత్రుల అవసరాలకు తగిన స్థాయిలో హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.


Updated Date - 2020-03-27T02:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising