ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో మార్నింగ్ వాక్.. డ్రోన్ సాయంతో అరెస్టు చేసిన పోలీసులు

ABN, First Publish Date - 2020-04-05T00:50:41+05:30

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. కరోనాను నియంత్రించడం కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రజలను రోడ్లపైకి రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. కానీ కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిని పట్టుకోవడం కోసం కేరళ పోలీసులు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. డ్రోన్‌లు ఉపయోగించి, రోడ్లపైకి వస్తున్న వారిని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేయడానికి బయటకు వచ్చిన 40మంది ఈ డ్రోన్ల కళ్లకు చిక్కారు. ఈ విషయం తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ 40 మందినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఎర్నాకులంలో సంభవించింది. పోలీసులు అరెస్టు చేసిన వారంతా.. ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. మళ్లీ ఇలాంటి పనులు చేయొద్దని వారిని పోలీసులు హెచ్చరించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2020-04-05T00:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising