రాజధానిలో ఉగ్ర దాడులకు కుట్ర.. నలుగురు యువకుల అరెస్ట్
ABN, First Publish Date - 2020-10-04T20:54:49+05:30
రాజధానిలో ఉగ్ర దాడులకు కుట్ర.. నలుగురు యువకుల అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్ర దాడులకు వ్యూహరచన చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కాశ్మీరీ యువకులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఒకరు పుల్వామా నివాసి, మరో ముగ్గురు షోపియన్ వాసులు అని డీసీపీ (స్పెషల్ సెల్) ప్రమోద్ సింగ్ కుష్వా తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐటిఓ ప్రాంతం నుంచి నాలుగు పిస్టల్స్ మరియు 120 రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Updated Date - 2020-10-04T20:54:49+05:30 IST