ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికులతో వెళ్తూ తిరగబడిన బస్సు.. 38 మందికి గాయాలు..

ABN, First Publish Date - 2020-05-26T01:55:21+05:30

వలస కార్మికులను తరలిస్తున్న ఓ బస్సు బోల్తా కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 38 మంది ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామ్‌గఢ్: వలస కార్మికులను తరలిస్తున్న ఓ బస్సు బోల్తా కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 38 మంది గాయపడ్డారు. కోల్‌కతాకి చెందిన బస్సు జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఓ మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి తిరగబడినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 77 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఘటనా ప్రాంతానికి సమీపంలోని కుల్హి గ్రామానికి చెందిన స్థానికులు వలస కార్మికులకు సాయం అందించారు. 25 మంది క్షతగాత్రులను రాంచీలోని రాజేంద్ర మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా.. మిగతా వారిని గోలా బ్లాక్‌లోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించినట్టు ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. ముంబై నుంచి కోల్‌కతా వెళ్లేందుకు ఒక్కొక్కరూ రూ.6 వేల చొప్పున చార్జీలు చెల్లించి వలస కార్మికులు ఈ బస్సును ఏర్పాటు చేసుకున్నారు. తామంతా పశ్చిమ బెంగాల్లోని స్వస్థలాలకు వెళ్తున్నట్టు అజీం బుట్టు అనే వలస కార్మికుడు పోలీసులకు వెల్లడించాడు. 

Updated Date - 2020-05-26T01:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising