ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రను వదలని కరోనా.. ఇవాళ కూడా..

ABN, First Publish Date - 2020-06-23T03:22:42+05:30

భారత్‌లో మహారాష్ట్ర కరోనా హాట్‌‌స్పాట్‌గా మారింది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలోనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారత్‌లో మహారాష్ట్ర కరోనా హాట్‌‌స్పాట్‌గా మారింది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. రోజురోజుకూ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్రలో కరోనాను కట్టడి చేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. మరణాల సంఖ్య కూడా మహారాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది. ఇవాళ మహారాష్ట్రలో కొత్తగా 3721 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.


దీంతో.. మహారాష్ట్రలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 135796కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 61793. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 67,706 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా బారిన పడిన వారిలో ఇవాళ మహారాష్ట్రలో 62 మంది మరణించారు. దీంతో.. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 6283కు చేరింది.

Updated Date - 2020-06-23T03:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising