ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 శాతం కరోనా కేసులు తబ్లీగీ జమాత్ వల్ల వ్యాపించినవే: కేంద్రం

ABN, First Publish Date - 2020-04-04T23:15:08+05:30

దేశంలో ఇప్పటివరకు నమోదైన అన్ని కేసుల్లో 30 శాతం కేసులు నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌వల్ల వ్యాపించినవేనని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు నమోదైన అన్ని కేసుల్లో 30 శాతం కేసులు నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌వల్ల వ్యాపించినవేనని కేంద్రం వెల్లడించింది. ఈ రోజు నమోదైన 601 పాజిటివ్ కేసులతో కలుపుకొని ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,903 కేసులు నమోదయ్యాయని కుటుంబ, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.


‘తబ్లీగీ జమాత్‌కు హాజరవడం వల్ల కరోనా బారిన పడిన వారిని ఇప్పటివరకు దాదాపు 17 రాష్ట్రాల్లో గుర్తించాం. వీరు మొత్తంగా 1,023 మంది ఉన్నారు. దేశంలోని మొత్తం కేసుల్లో వీరే దాదాపు 30 శాతం మంది ఉన్నార’ని అగర్వాల్ చెప్పారు. దీనిపై అదే శాఖకు చెందిన మరో అదనపు కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాత్సవ మాట్లాడుతూ తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిలో దాదాపు 22వేల మందిని గుర్తించామని, వీరితో సన్నిహితంగా ఉన్న వారిని కూడా గుర్తించి అందరినీ క్వారంటైన్ చేశామని తెలిపారు. 

Updated Date - 2020-04-04T23:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising