పశ్చిమ బెంగాల్లో ముగ్గురు తృణమూల్ కార్యకర్తలపై కాల్పులు
ABN, First Publish Date - 2020-11-04T01:48:20+05:30
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు కార్యకర్తలపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు...
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు కార్యకర్తలపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని జిబంతాలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. సోమవారం రాత్రి ఓ ఇంటి ముందు ముగ్గురు కార్యకర్తలు నిలబడి మాట్లాడుకుంటుండగా వారిపై దుండగులు కాల్పులు జరిపారు. ఇటీవల కొద్ది రోజులుగా గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారనీ.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించినందుకు తమపై కాల్పులు జరిపారని బాధితులు పేర్కొన్నారు. బుల్లెట్ గాయాలైన ముగ్గుర్నీ సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా మంగళ వారం ఉదయం కొందరు వ్యక్తులు జిబంతాలా గ్రామం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వారిని పట్టుకుని చితకబాదారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి రెండు ఆయుధాలు, పలు క్యాటరిట్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
Updated Date - 2020-11-04T01:48:20+05:30 IST