ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి : మూడు ఎఫ్‌ఐఆర్లు, ఏడుగురిపై కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-12-11T22:02:25+05:30

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి సంఘటనలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి సంఘటనలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి మూడు ఎఫ్‌ఐఆర్లను నమోదు చేయడంతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారంటూ రెండు సుమోటో ఎఫ్‌ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. మూడో ఎఫ్‌ఐఆర్ మాత్రం బీజేపీ నేత రాకేశ్ సింగ్‌పై నమోదు చేయడం గమనించదగ్గ అంశం. దగ్గర్లో ఉన్న గుంపులను రెచ్చగొట్టినందుకు గాను ఆయనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పై గురువారం దాడి జరిగింది. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ కు వెళ్తుండగా టీఎంసీ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేశారు. అయితే ఈ దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. పశ్చిమ బెంగాల్ లో నెలకొన్న శాంతిభద్రతల సమస్యపై తక్షణమే నివేదికను సమర్పించాలని గవర్నర్ ధన్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కోరారు. 

Updated Date - 2020-12-11T22:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising