ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడా, బ్రిటన్‌లలో కరోనా సెకెండ్ వేవ్... ప్రపంచవ్యాప్తంగా 3.24 కోట్ల కరోనా బాధితులు!

ABN, First Publish Date - 2020-09-26T13:55:23+05:30

ప్రపంచంలో మొత్తం కరోనా బాధితులు సంఖ్య 3.24 కోట్లను దాటింది. మృతుల సంఖ్య 9.88 లక్షలు దాటింది. కరోనా మహమ్మారి బారినపడిన 2.39 కోట్ల మంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచంలో మొత్తం కరోనా బాధితులు సంఖ్య 3.24 కోట్లను దాటింది. మృతుల సంఖ్య 9.88 లక్షలు దాటింది. కరోనా మహమ్మారి బారినపడిన 2.39 కోట్ల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో కెనడా, బ్రిటన్‌లలో కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమయ్యింది. కాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో తమ దేశంలో కరోనా సెకెంట్ వేవ్ వార్తలను ఖండించారు. దేశంలో తాజాగా 1300 కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 1.50 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది. 



అదేవిధంగా బ్రిటన్‌లో కొత్తగా 6,634 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కారణంగా మొత్తం 41,902 మంది మృతి చెందారు. కాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా తమ దేశంలో కరోనా సెకెంట్ వేవ్ లేదని పేర్కొన్నారు. ఇక మెక్సికో విషయానికొస్తే కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో 490 మంది మృతి చెందారు. దీంతో మెక్సికోలో మొత్తం మృతుల సంఖ్య 75 వేలు దాటింది. ఇదే సమయంలో దేశంలో కొత్తగా 5500 కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్‌లో గడచిన 24 గంటల్లో 798 కరోనా కేసులు నమోదుకాగా, మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,09,015కు చేరింది. కరోనాతో కొత్తగా ఏడుగురు మృతి చెందారు. దీంతో పాక్‌లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,444కు చేరింది.

Updated Date - 2020-09-26T13:55:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising