ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2,902 కేసులు ... 68కి చేరిన మృతులు

ABN, First Publish Date - 2020-04-04T19:36:19+05:30

దేశంలో కొత్తగా 601 కరోనా కేసులు నమోదు కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,902కి చేరింది. గత 24 గంటల్లో 12 మంది మృత్యువాత ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 601 కరోనా కేసులు నమోదు కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,902కి చేరింది. గత 24 గంటల్లో 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో ఇంతవరకూ కరోనా కాటుకు బలైన వారి సంఖ్య శనివారంనాటికి 68కి చేరింది. కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో తాజా మరణాలు చోటుచేసుకోగా, రాబోయే కొద్ది రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.


'గత రెండు రోజుల్లో ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌ సదస్సులో పాల్గొన్న 600 మందిని క్వారంటైన్‌లో ఉంచాం. ఇతరుల జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకూ కరోనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 386 కాగా, ఇందులో మర్కజ్ ముజాహిద్దీన్‌కు చెందిన వారి సంఖ్య 259గా ఉంది. రెండు మూడు రోజులకు సరిపడేలా 7000 నుంచి 8000 పీపీఈ (పెర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్)లు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. అత్యవసరంగా 50,000 పీపీఈ కిట్లు అవసరం ఉంది' అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.

Updated Date - 2020-04-04T19:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising