దీపావళి నేపథ్యంలో అగ్నిమాపక శాఖ కీలక నిర్ణయం
ABN, First Publish Date - 2020-11-14T03:44:54+05:30
దీపావళి నేపథ్యంలో అగ్నిమాపక శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీ అగ్నిమాపక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా 2,500 మంది సిబ్బందిని మోహరించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి తమ సిబ్బంది సెలవు దరఖాస్తులను రద్దు చేసినట్లు అగ్నిమాపక శాఖ పేర్కొంది.
మా వాహనాలు మోహరించబడే 24 ప్రదేశాలను కూడా మేము గుర్తించామని డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. పటాకులపై నిషేధం ఉన్నప్పటికీ అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని ఆయన అన్నారు.
Updated Date - 2020-11-14T03:44:54+05:30 IST