ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరుకు ఇంట్లో నివాసం.. కుటుంబంలోని 25మందికి సోకిన కరోనా

ABN, First Publish Date - 2020-03-30T21:02:04+05:30

ఓ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల మార్చి 23వ తేదీన సౌదీ అరేబియా నుంచి తమ స్వగ్రామం మహారాష్ట్రలోని సంగ్లీ గ్రామానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగ్లీ: ఓ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల మార్చి 23వ తేదీన సౌదీ అరేబియా నుంచి తమ స్వగ్రామం మహారాష్ట్రలోని సంగ్లీ గ్రామానికి చేరుకున్నారు.  మార్చి18వ తేదీన ముంబై చేరుకున్న వీరికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగింది. అయితే ఇది తెలిసిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుండా వాళ్లు తమ ఇరుకు ఇంట్లో మిగితా కుటుంబసభ్యులతో కలిసి ఉండటంతో రెండు సంవత్సరాల చిన్నారితో పాటు మరో 21 మంది కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకింది. 


అయితే వీరి ద్వారా ఆ చుట్టుపక్కలవారికి ఎటువంటి అపాయం జరుగలేదని జిల్లా ఆదికారులు తెలిపారు. 


‘‘ఇస్లామాపూర్ తహసిల్‌కు చెందిన ఈ 25మంది కుటుంబసభ్యులు చాలా ఇరుకు ఇంట్లో నివసిస్తారు. వీరికి వైరస్ సోకడానికి అదే కారణం. తరచూగా ఒకరిని మరొకరు తాకుతూ ఉండటం.. తదిరత పరిణామాల వల్లే ఇలా జరిగింది’’ అని అధికారులు స్పష్టం చేశారు. 


దీనిపై జిల్లా సివిల్ సర్జన్ సీఎస్ సాలుంఖే మాట్లాడుతూ.. ‘‘కరోనా సోకిన ఓ వ్యక్తి ఇంట్లో దగ్గితే.. ఆ తుంపరులు గదిలోని వస్తువులపై పడతాయి. కొన్ని వస్తువులను ఇంట్లోని అందరు ఉపయోగిస్తారు. అది వైరస్ సోకేందుకు కారణం. అయితే ఎటువంటి వైరస్ లక్షణాలు లేకపోయినా కుటుంబానికి చెందిన 47మందికి పరిక్షలు నిర్వహించామని కానీ, అందులో 25 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా ఉందని తేలింది’’ అని అన్నారు. 


ఎప్పుడైతే ఆ నలుగురికి కరోనా లక్షణాలు ఉన్నాయని నిర్ధారణ జరిగిందో.. అప్పుడే వారికి వారే.. క్వారెంటైన్‌లోకి వెళ్లి ఉంటే ఇంత పెద్ద సమస్య ఏర్పడి ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.


దీనిపై కలెక్టర్ అభిజిత్ చౌదరీ మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి కేసులను ఆరంభంలోనే గుర్తించడం ద్వారా మంచే జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇందరికి వైరస్ సోకిన విషయం ఆరంభంలోనే గుర్తించకుంటే.. వాళ్లు స్వేచ్ఛగా సమాజంలో తిరిగే అవకాశం ఉంది. తద్వారా ఈ వైరస్ మరింత మందికి సోకేది. వీరి కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే నగరంలోని ప్రజలు అప్రమత్తమై ఇళ్లు పదిలి బయటకు రావడం లేదు. ఇప్పటివరకూ వీరి ద్వారా ఎవరికీ ఈ వైరస్ సోకలేదు. వైరస్ సోకిన 25మందని సంగ్లీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ విభాగంలో ఉంచాము. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’’ అని తెలిపారు. 

Updated Date - 2020-03-30T21:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising