ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 గంటల్లో 240 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-04-01T20:29:38+05:30

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-190 పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ మరింత పెరుగుతోంది. గత 12 గంటల్లోనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-190 పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ మరింత పెరుగుతోంది. గత 12 గంటల్లోనే 240 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1637కు చేరినట్టు పేర్కొంది. కరోనా కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోగా.. 133 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నట్టు కేంద్రం వెల్లడించింది.


ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కేంద్రంగా నిర్వహించిన ఓ మత కార్యక్రమానికి వెళ్లిన పలువురికి కరోనావైరస్ సోకినట్టు తేలడంతో ఒక్కసారిగా కోివిడ్-19 కేసుల సంఖ్య పెరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరు కావడంతో... ఎవరెవరు వెళ్లారన్న దానిపై ప్రభుత్వాలు ఆరాతీస్తున్నాయి. ఇప్పటికే  కేంద్రం మర్కజ్ ప్రాంతాన్ని కరోనా హాట్‌స్పాట్‌గా ప్రకటించగా... ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు ఇక్కడి నుంచి 2,361 మందిని తరలించారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 91 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. వీరిలో ఒక్క తమిళ నాడు నుంచే 50 మంది కోవిడ్-19 పాజిటివ్‌ రోగులు ఉన్నట్టు గుర్తించారు. 

Updated Date - 2020-04-01T20:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising