ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగులు పడి ఒక్కరోజే 23 మంది మృతి

ABN, First Publish Date - 2020-07-05T14:26:41+05:30

ప్రయాగరాజ్‌లో తొమ్మిది మంది, మీర్జాపూర్ లో పది మంది, కౌశాంబిలో నలుగురికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయని స్థానిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : యూపీలో పడుతున్న పిడుగులకు మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే మెరుపులతో 23 మంది మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. అధికారుల లెక్కల ప్రకారం అలహాబాద్‌లో ఎనిమిది మంది, మిర్జాపూర్ లో ఆరుగురు, కౌశంబీలో ఇద్దరు, జాన్‌పూర్‌లో ఒక్కరు మృతి చెందారు. ఇక, బధోయ్ జిల్లాలో ఆరుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలైనట్లు సమాచారం. 


ప్రయాగరాజ్‌లో తొమ్మిది మంది, మీర్జాపూర్ లో పది మంది, కౌశాంబిలో నలుగురికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయని స్థానిక అధికారులు ప్రకటించారు. ఈ పిడుగుల కారణంగా 23 మంది మరణించడంపై సీఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిచాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పిడుగుల కారణంగా తీవ్ర గాయాలైన వారికి సరైన వైద్య సదుపాయం అందేలా చూడాలని కూడా అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-07-05T14:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising