ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు రైళ్లు నడిపేందుకు 23 సంస్థల ఆసక్తి..!

ABN, First Publish Date - 2020-08-13T05:08:47+05:30

భారత్‌లో ప్రవేటు రైళ్లు నడిపేందుకు అనేక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వీటిలో అంతర్జాతీయ సంస్థల కూడా ఉండటం విశేషం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రవేటు రైళ్లు నడిపేందుకు అనేక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వీటిలో అంతర్జాతీయ సంస్థల కూడా ఉండటం విశేషం. ఈ విషయమై ప్రభుత్వాదికారులతో జరిగిన సమావేశంలో దాదాపు 23 సంస్థలు పాలుపంచుకున్నాయి. అంతర్జాతీయ సంస్థలైన ఆల్‌స్టోమ్, బొంబార్డియే, సీమెన్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దేశంలోని 109 రూట్లలో ప్రైవేటు రైళ్లకు అనుమతిస్తున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 151 ప్రైవేటు రైళ్లను దాదాపు 35 ఏళ్ల పాటు నిర్వహించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఆసక్తిగల సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాలని కూడా తెలిపింది. ఈ క్రమంలో వివిధ ప్రైవేటు సంస్థలు లాంఛనంగా దారఖాస్తు చేసే ముందు.. కొన్ని అంశాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. 

Updated Date - 2020-08-13T05:08:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising