ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరులో శనివారం నుంచి 20,000 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు

ABN, First Publish Date - 2020-07-11T05:08:08+05:30

శనివారం నుంచి బెంగళూరులో 20,000 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయనున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: శనివారం నుంచి బెంగళూరులో 20,000 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయనున్నట్లు కర్ణాటక వైద్యవిద్యా శాఖ మంత్రి సుధాకర్ శుక్రవారం ప్రకటించారు. బెంగళూరు నగరంలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులకే కర్ణాటక ప్రభుత్వం మొగ్గు చూపింది. బెంగళూరులో శుక్రవారం ఒక్కరోజే 1,447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా మరణాలు కూడా ఐటీ నగరాన్ని కలవరపెడుతున్నాయి. శుక్రవారం బెంగళూరు నగరంలో కరోనా వల్ల 29 మంది మరణించారు. యాంటీజెన్ టెస్టులు చేస్తే ఇంకెన్ని కేసులు బయటపడే అవకాశం ఉందోనన్న సందేహం వ్యక్తమవుతోంది.


మన శరీరంలోకి చేరిన రోగ కారకాన్ని యాంటీజెన్‌(ప్రతిజనకం) అంటారు. దీన్ని తిప్పికొట్టేందుకు ఆ వెంటనే రోగ నిరోధక వ్యవస్థ మోహరించే రక్షక భటులే యాంటీబాడీలు(ప్రతిరక్షకాలు). యాంటీజెన్‌ను గుర్తించడం ద్వారా ఇన్ఫెక్షన్‌ సోకిందా? లేదా ? అనేది నిర్ధారించేందుకు యాంటీజెన్‌ పరీక్షలు చేస్తారు. వైరస్‌ సోకిన కొద్ది గంటల్లో ఈ టెస్టు చేస్తే పాజిటివ్‌గా చూపిస్తుంది. ఒకవేళ వైరస్‌ ఎటాక్‌ చేయకపోతే నెగెటివ్‌ వస్తుంది. సాధారణంగా యాంటీజెన్‌ టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చిన వారికి మళ్లీ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో కూడా పాజిటివ్‌ వస్తే వారికి కరోనా వైరస్‌ సోకినట్లుగా నిర్ధారించి చికిత్స అందిస్తారు.

Updated Date - 2020-07-11T05:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising