ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో భీకరంగా పెరిగిపోతున్న కేసులు!

ABN, First Publish Date - 2020-05-19T03:30:33+05:30

కరోనా వైరస్ మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్ మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,033 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 35 వేల మార్కును దాటేసి 35,058గా నమోదైంది. వీటిలో 25,392 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు, మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నిన్న (ఆదివారం) 51 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,249కి పెరిగింది. 


మొత్తం కేసుల్లో 40 శాతం ఒక్క ముంబైలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం రోగుల్లో 21,152 మంది ముంబై వారే కావడం గమనార్హం. నగరంలో తాజాగా 23 మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని నగరంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 757కు పెరిగింది. ఇక, ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో కొత్తగా 85 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ఇక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1327కు పెరగ్గా, 56 మంది మరణించినట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది.  

Updated Date - 2020-05-19T03:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising